MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

10TH CLASS TM - PLANS





PHYSICAL SCIENCE - T.M
భౌతిక రసాయన శాస్త్రములు - తెలుగు మాధ్యమం 
    వార్షిక ప్రణాళిక     పాఠ్య పథకములు     పీరియడ్  పథకములు   

YEAR PLAN


1. తరగతి                                 : 10వ తరగతి 
2. సబ్జెక్టు                                  : భౌతిక రసాయన శాస్త్రములు 
3. మొత్తం పిరియడ్ల సంఖ్య            : 130
                  i ) బోధనా కొరకు        : 110
                 ii ) ప్రయోగశాల కొరకు  : 20
4. సాధించాల్సిన విద్యా ప్రమాణాలు   : 

  1) విద్యార్థులు వివిధ రకాల రసాయన చర్యలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, వివిధ తలాల వద్ద కాంతి పరావర్తనం, వక్రీభవనం, అణువులలో పరమాణువుల మధ్య బంధము, లోహాల సంగ్రహణలోని ప్రక్రియలు, కార్బన్ యొక్క ప్రత్యేకత మొదలైన భావాలను వివరిస్తారు. ఉదాహరణలను, కారణాలను చెప్పగలుతుతారు.
  2) పై భావనలను అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు వేస్తారు. నిర్వహించే ప్రయోగాల ఫలితాలను పరికల్పన చేస్తారు.
    3) విశిష్టోష్ణం , భాష్పీభవనం, వివిధ రసాయన చర్యల రకాలు, వివిధ తలాల వద్ద కాంతి పరావర్తనం, వక్రీభవనం చెందడం, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానం వంటి అంశాలపై ప్రయోగాలు నిర్వహిస్తారు. మట్టి నమూనా సేకరణ వంటి pH లను కనుగొనడం వంటి క్షేత్ర పర్యటనలలో పాల్గొంటారు.
 4) ఓమ్‌ నియమం, మూలకాల ఆవర్తన పట్టికకు సంబంధించి వివిధ సమాచారాన్ని పట్టిక రూపంలో చూపడం, ఆమ్లాలు, క్షారాల బలాలను విశ్లేషిస్తూ పట్టిక రూపంలో ప్రదర్శిస్తారు. మరియు విశ్లేషిస్తారు.
 5) తాము చేసిన ప్రయోగాలు, పరిశీలనలు, పరికరాల అమరికను తెలిపే పటాలను గీయగలుగుతారు. విద్యుత్ మోటారు, వివిధ అణువుల ఆకృతుల నమూనాలను తయారుచేసి వివరించగలుగుతారు.
  6) కాంతి పరావర్తనం, వక్రీభవనం అనువర్తనాలు, మానవ నిర్మాణంలో ఉన్న భౌతిక శాస్త్ర విషయాలను, pH వంటి అంశాలు నిజజీవితంలో వినియోగించడం ద్వారా శాస్త్ర విషయాలను అభినందిస్తాడు. 
   7) మూలకాలను సరైన క్రమంలో అమర్చిన తీరు, వాటి అధ్యయనం సులభతరం ద్వారా శాస్త్రవేత్తల కృషిని అభినందించగలుగుతారు.
 8) కటకాలు, అమ్లాలు, క్షారాలు, లవణాలు, కర్బన సమ్మేళనాలు, వివిధ రసాయన పదార్థాలను దైనందిన జీవితంలో సమర్థవంతంగా వినియోగిస్తారు. ప్రకృతిలో వైవిధ్యాన్ని గుర్తిస్తారు.

మాసవారీ యూనిట్ల విభజన ప్రణాళిక

మాసం
యూనిట్ పేరు
పీరియడ్ల సంఖ్య
నిర్వహించాల్సిన కార్యక్రమాలు
జూన్
ఉష్ణము
08
ప్రయోగశాల కృత్యం
జూలై
రసాయన చర్యలు- సమీకరణాలు
కాంతి పరావర్తనం
08
కృత్యాల నిర్వహణ, సమాచార సేకరణ చర్చ,
వివిధ దర్పణాలతో ప్రయోగాలు నిర్వహణ
ఆగష్టు
ఆమ్లాలు-క్షారాలు-లవణాలు
సమతల ఉపరితలాలవద్ద
కాంతి వక్రీభవనం
08
సమాచార సేకరణ, చర్చ, క్షేత్ర పర్యటన
సెప్టెంబరు
వక్రతలాలవద్ద కాంతి వక్రీభవనం
10
సెప్టెంబరు - అక్టోబరు
మానవుని కన్ను - రంగుల ప్రపంచం    08ఇంటర్వ్యూ - వైద్యునిచే గెస్ట్ లెక్చర్
అక్టోబరు
పరమాణు నిర్మాణం 
05
మోడల్ తయారీ 
నవంబరు 
మూలకాల వర్గీకరణ - 
ఆవర్తన పట్టిక 
10
ఆవర్తన పట్టిక ఆకారం 
ప్రాక్టిసు చేయడం
నవంబరు - డిసెంబరు 
రసాయన బంధం 
10
నమూనాలు తయారు చేయడం 
డిసెంబరు
విద్యుత్ ప్రవాహం
09
ఎలక్ట్రీషియన్ చే గెస్ట్ లెక్చర్ ఇంటర్వ్యూ
డిసెంబరు-జనవరి
విద్యుదయస్కాంతత్వం
10
కృత్యాల నిర్వహణ, విద్యుత్ మోటారు,
సోలినాయిడ్ నమూనాల తయారీ
జనవరి
లోహ సంగ్రహణ శాస్త్రం
06
ప్లోచార్ట్ తయారుచేయడం, బొమ్మలు
గీయించడం, లోహకారునితో ముఖాముఖి
ఫిబ్రవరి
కార్బన్ దాని సమ్మేళనాలు
12
కృత్యాల నిర్వహణ, చర్చం సెమినార్
FA 4
మార్చి
పునఃశ్చరణ తరగతులు

2 comments: