MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

formative examination system


FORMATIVE ASSESSMENT
తరగతి గదిలో కల్పించిన అభ్యసన కృత్యాలలో పిల్లలు పాల్గొంటున్నప్పుడు, బోధన జరుగుతున్నప్పుడు విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి నమోదు చేయడం ద్వారా పిల్లల అభ్యసనాన్ని మెరుగు పరచడానికి కృషిచేయడాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. కేవలం మార్కులు, గ్రేడుల రూపంలో కాకుండా పిల్లలకు వారి సామర్థ్యాల సాధనా స్థితిగతులను వివరణాత్మకంగా తెలిపి వారికి సరైన సూచనలు సలహాలు ఇచ్చి ప్రోత్సహించి అభ్యసనాన్ని మెరుగుపరచడానికి నిర్మాణాత్మక మూల్యాంకనం సహాయపడుతుంది.
నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రధానంగా నాలుగు రకాల సాధనాలను ఉపయోగించాలి.
1. ప్రయోగశాల పనులు                                              - 10 మార్కులు
2. రాత అంశాలు (నోటు పుస్తకాలు, ఇంటిపని మొదలైనవి) - 10 మార్కులు
3. ప్రాజెక్టు పనులు                                                     - 10 మార్కులు
4. లఘు పరీక్ష                                                          - 20 మార్కులు
1.ప్రయోగశాల పనులు, ప్రయోగశాల రికార్డు - నిర్వహణ: 
పిల్లలు ప్రయోగశాలలో ప్రయోగాలు చేసిన విధానాన్ని, సాధించిన ప్రక్రియ నైపుణ్యాలను మదింపు చేయాలి. ఇందుకోసం ఉపాధ్యాయుదు రెండు అంశాలలో పిల్లలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.

  • ప్రయోగశాలలో, తరగతి గదిలో, ప్రయోగం చేస్తున్నప్పుడు పిల్లలను పరిశీలించడం
  • ప్రయోగశాల రికార్డు.
ప్రయోగశాలలో పిల్లలు ప్రయోగాలు చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా, జట్లలో పనిచేస్తున్న విధానం, పరికరాల అమరిక, పరికరాలు ఉపయోగించడంలో ప్రదర్శించిన నైపుణ్యం, అంశాలను పరిశీలించే విధానం వాటిని నమోదు చేసే విధానం, ఫలితాలను విశ్లేషించి నిర్ధారణకు రావడం మొదలైన అంశాలన్నింటిని ఉపాధ్యాయుడు పరిశీలించాలి. అయితే పిల్లలు ప్రయోగం చేసారు అనడానికి ప్రయోగ నివేదిన ఒక్కతే ఆధారం కాబట్టి ప్రయోగ రికార్డులోనే పిల్లలు ఎలా ప్రయోగం చేసారో ఒక పేరా రూపంలో రాయించాలి. ప్రయోగం చేసిన పద్ధతికి 4 మార్కులు, ప్రయోగశాల రికార్డు కు 6 మార్కులు కేటాయించాలి. 
2. రాతపనులు - నోటు పుస్తకాలు: 
ప్రతి విధ్యార్థి నోటు పుస్తకాన్ని విధిగా నిర్వహించాలి.
యూనిట్ వారీగా కీలక పదాలు, నూతన పదాలు జాబితాగా నోటు పుస్తకంలో రాయించాలి. తరగతి చర్చల తరువాత వారి అవగాహనను బట్టి ఆయా పదాలకు వివరణలను రాయమనాలి. ఇది విషయావగాహనకు, తరువాత సొంతంగా సమాధానం రాయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి యూనిట్ లో అభ్యసనాన్ని మెరుగు పర్చుకుందాం క్రింద యివ్వబడిన ప్రశ్నలకు జవాబులు నోటు పుస్తకంలో సొంతంగా ఆలోచించి రాయాలి. రాత పరీక్ష మూల్యాంకనానికి వారు పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు గా కాకుండా సొంతంగా రాసినదిగా ఉండే విధానానికి, అవసరం అయిన చోట బొమ్మలు చేర్చే విధానానికి మరియు పదాలు, వాక్యాలు అర్థవంతంగా భాషాదోషాలు లేకుండా ఉండే విధానానికి మార్కులు కేటాయించాలి.
3. ప్రాజెక్టు పనులు: 
ప్రతి ఫార్మాట్ కాలంలో ఒక ప్రాజెక్టును తప్పని సరిగా చేయించాలి. ఒకవేళ రెండు, మూడు ప్రాజెక్టులు చేయించినట్లయితే వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మార్కులు ఇవ్వాలి.

  • ఇంటర్వ్యూలూ చేయడం ద్వారా సమాచారం సేకరించి ప్రాజెక్టు నిర్వహించడం.
  • సేకరణల ద్వారా సమాచారం సేకరించి ప్రాజెక్టు నిర్వహించడం
  • రిఫెరెన్సు పుస్తకాలు, పరిశోధనా గ్రంధాలు చదవడం దానిపై నివేదిక రాయడం.
  • పరికరాలలోని జీవ సంబంధ, ప్రకృతి దృగ్విషయాలను పరిశీలించడం దానిపై నివేదికలు రూపొందించడం.
  • పాఠశాలలో లేదా పాఠశాలలు వాటి ఒక సమస్యా పరిష్కారం కనుగొనడానికి వివిధ ప్రయోగాలు చేయడం.
  • ఏదైనా వస్తువును, నమూనాను తయారుచేయడం - సృజనాత్మకంగా ఆలోచించి ఉత్పాదక పనిని చేయడం. 
ఉపాధ్యాయుడు నాలుగు ఫార్మాటివ్ లలో వ్యక్తిగత, జట్టు ప్రాజెక్టులు నిర్వహించాలి. అలాగే ప్రతి ప్రాజెక్టు నైపుణ్యమైనదిగా ఉండేలా ఉండేలా చూడాలి. 
4. లఘు పరీక్ష :
నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఒక పాఠాన్ని బోధించిన తరువాత విషయావగాహన ఏ మేరకు జరిగిందో ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాల్సిన అవసరముంది. నిర్దేశించిన సమయంలో కాకుండా పరీక్ష అనే భావన కలుగకుందా ఏ సమయంలోనైనా పాఠ్యాంశం ఏ మేరకు అవగాహన అయిందో తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్షను లఘు పరీక్ష అంటారు. ఇది సాధారణంగా నిర్వహించే యూనిట్ పరీక్ష వంటిది కాదు. 

2 comments: