SCIENCE FREE MAGAZINE - ADITHA
|
ఆదిత తెలుగులో ప్రచురితమవుతున్న శాస్త్రవిజ్ఞాన మాసపత్రిక. దీనికి ఖమ్మం జిల్లా కు చెందిన ఉపాధ్యాయులు యం. ఆదిత్యకుమార్ సంపాదకత్వం వహిస్తున్నారు. ఇది ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ) పేరుతో ప్రచురితమవుతున్నది. ఈ పత్రికకు నిర్వాహకులుగా డి.జగదీశ్వర్ మరియు ఆర్.శ్రీనివాస్ అనే ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పత్రికలో విద్యార్థులకు అవసరమైన శాస్త్ర విజ్ఞాన అంశాలను వివిధ రంగాలలో ఉన్న నిష్ణాతులు, ఉపాధ్యాయులు అందిస్తున్నారు. ఈ పత్రికలో అధ్బుత ప్రపంచం, నేనెవరో నీకు తెలుసా!, విజ్ఞాన శాస్త్ర పజిల్స్, విద్యార్థులు గీచిన చిత్రాలు, సృజనాత్మకత కలిగించే అంశాలు, సందేహాలు-సమాధానాలు, శాస్త్రవేత్తల సమాచారం, విద్యార్థులలో ఆలోచనను రేకెత్తించే అంశాలు, విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు, సులభంగా చేసే ప్రయోగాలు, నిజజీవితంలో విజ్ఞానశాస్త్ర అంశాలు మరియు నెలలో వివిధ శాస్త్రరంగ ప్రముఖ దినాల గూర్చి సమాచారం చేర్చబడుతుంది. విద్యార్థులను అత్యున్నత భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ పత్రిక ఉపయోగపడుతుంది. దీనిని ప్రతీ పాఠశాలలో విద్యార్థులతో చదివించినట్లయితే వారిలో శాస్త్రీయ దృక్పథం, వైజ్ఞానిక ఆవిష్కరణల పట్ల ఉత్సుకత కలిగి మంచి విజ్ఞానవేత్తలుగా తయారవుతారు.
ఈ పత్రిక యొక్క పి.డి.ఎఫ్ కాపీలను ఈ క్రింది లింకు నుండి డౌన్ లోడ్ చేసుకొని చదవండి.....చదివించండి..... విజ్ఞాన శాస్త్రవేత్తలను తయారుచేయండి.......
|
Please upload blue print of S.A-1 QUESTION PAPER OF CLASSES. 8,9&10
ReplyDelete