MAIN MENU

✿ ఈ బ్లాగు ఫిజికల్ సైన్స్ అభిమానులైన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకోసం తయారుచేయబడినది. ఈ బ్లాగులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన మరియు అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. మీ సలహాలను, అభిప్రాయాలను తెలియజేయుటకు 9440105650 నెంబరును సంప్రదించండి. ✿ This blog is made for students and teachers who are fans of Physical Science. The information in this blog can be used for educational teaching and learning. To express your suggestions and opinions, contact 9440105650. ✿

NCSC

National Children's Science Congress
1993వ సంవత్సరం నుండి జాతీయ శాస్త్ర సాంకేతిక సమాచార మండలి NCSTC ద్వారా దేశంలోని బాలల్లో సృజనాత్మకతను, విజ్ఞాన శాస్త్రంపై ఆశక్తిని పెంపొందించడానికి జాతీయ బాలల నైన్స్ కాంగ్రెస్ నిర్వహించబడుతున్నది. బాలలు తమలోని సృజనాత్మకతను ప్రదర్శించేందుకు, శాస్త్రీయ పద్దతుల ద్వరా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సామర్థ్యం పెంచుకొని తద్వారా సమాజానికి ప్రయోజనం చేకూర్చేందుకు ఈ జాతీయ బాల సైన్స్ కాంగ్రెస్ ఒక ప్రత్యేక వేదికగా ఏర్పడినది.
NCSC కి రాష్ట్ర స్థాయిలో సమన్వయ కర్తగా ఉన్న రాష్ట్ర, శాస్త్ర సాంకేతిక మండలి, రాష్ట్రం లోని గ్రామీణ, పట్టన ప్రాంతాలలోని పిల్లలలో శాస్త్ర సాంకేతిక అంశాలపై అభిరుచి, ఆసక్తి పెంపొంచించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొనేలా బాలలను ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పలు నిర్వాహక కమిటీలు ఏర్పాటు చేసి విజయవంతంగా ఈ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కమిటీలో NCSTC మార్గదర్శక సూత్రాల ప్రకారం పాఠశాల విద్య (SCERT), సర్వశిక్ష అభియాన్, జాతీయ గ్రీన్ కోర్, ప్రభుత్వ గురుకులాలు, జిల్లా విద్యా శిక్షణా సంస్థలు, స్థానిక NOSTC గౌరవ సభ్యులు స్వచ్ఛంద సంస్థల నుండి అనుభవజ్ఞులైన వారిని సభ్యులుగా తీసుకొని శాస్త్ర సాంకేతిక అంశాలలో బాలలు పాల్గొనేలా చేసి పలు కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నది.

బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ లక్ష్యాలు
  • ఐదుగురు బాల ప్రతినిధులతో కూడిన బృందాలు శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలు, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు సమిష్టి కృషి చేసేలా చర్యలు తీసుకోవడం.
  • పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల నుండి మాత్రమే కాకుండా 10 నుండి 17 ఏళ్ళ లోపు బడి మానేసిన పిల్లలను కూడా ఈ వేదిక పైకి తీసుకురావడం, 10 నుండి 14 ఏళ్ళ లోపు వారిని జూనియర్లుగా, 14 ఏళ్ళు దాటిన మరియు 17 ఏళ్ళ లోపువారికి సీనియర్లుగా విభజించి ప్రోత్సహించడం.
  • ఒక వైపు పిల్లల్లో క్షేత్రస్థాయి పరిశీలన, సమాచార సేకరణ, సర్వే పద్దతులు, విశ్లేషణ సామర్థ్యం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, మరో ప్రక్క నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు బాలలు ఆచరణాత్మక పరిశోధనలు చేపట్టేలా వెన్ను తట్టడం.

ప్రాజెక్టు రిపోర్టులో ఉంచవలసిన అంశాలు
ప్రాజెక్టు రిపోర్టు తయారీనందు క్రింది అంశాలను పరిగణనలోనికి తిసుకోవాలి.
  1. ముఖచిత్రం
    1. ప్రాజెక్టు శీర్షిక
    2. గ్రూపు లీడరు మరియు ఇతర సభ్యుల పేర్లు, చిరునామా.
    3. గైడ్ టీచరు పేరు, చిరునామా
  2. రిజిస్ట్రేషన్ ఫారం (ఫారం - ఎ)
  3. సంక్షిప్త రిపోర్టు - 250 పదాలు (ఆంగ్లంలో)
  4. పరిచయం - అధ్యయనం, శీర్షికలు, పట్టికలు మ్యాపులు మొదలైన వాటిని సూచిస్తూ పుట సంఖ్యలు
  5. పరిచయం - అధ్యయనం యొక్క పూర్వ పరిస్థితులు
  6. లక్ష్యాలు - స్పష్టీకరణలు
  7. పరికల్పనలు
  8. ప్రాజెక్టు ఆవశ్యకత
  9. ప్రాజెక్టు ప్రణాళిక
  10. అధ్యయన పద్ధతి
  11. పరిశీలనలు
  12. దత్తాంశ సేకరణ మరియు అన్వయం, విశ్లేషణ
  13. ఫలితాలు
  14. ముగింపు
  15. సమస్య పరిష్కారం
  16. భవిష్యత్ ప్రణాళిక
  17. కృతజ్ఞతలు
  18. పరిశీలనా గ్రంథాలు
ప్రాజెక్టు రిపోర్టు నందు జూనియర్ స్థాయికి 2500 పదాలు, సీనియర్ స్థాయికి 3500 పదాలు పరిమితిని పాటించాలి.
అదే విధంగా పరిమిత సంఖ్యలో పోటోగ్రాఫులు, పట్టికలు, గ్రాఫులు మరియు చిత్రాలను వాడాలి. ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన కృషి, ఫలితాలను రిపోర్టులో పొందుపరచాలి.

మాదిరి ప్రాజెక్టులు: 

No comments:

Post a Comment