MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

SCIENCE MAGAZINE VIGNANA DEEPIKA


విజ్ఞాన దీపిక
VIGNANA DEEPIKA
విజ్ఞాన దీపిక పుస్తక ముఖచిత్రం
సంపాదకులు:వి. నాగమూర్తి
డి. మురళి
సత్యవాడ ఛైతన్యకుమార్ 
ప్రధాన సంపాదకులు:వి. నాగమూర్తి 
దేశం:భారత దేశము
భాష:తెలుగు
కళా ప్రక్రియ:శాస్త్ర విజ్ఞాన వ్యాసాలు, అంశాలు
ప్రచురణ:విజ్ఞాన దీపిక. కామ్ 
విడుదల:2017, మే 
ముద్రణ:ఆంధ్రప్రదేశ్ 
ప్రతులకు:http://www.vignanadeepika.com/
ముద్రణా సంవత్సరాలు:2017

"విజ్ఞాన దీపిక" తెలుగులో ప్రచురితమవుతున్న శాస్త్రవిజ్ఞాన మాసపత్రిక. ఇది  ఆన్‌లైన్ మాసపత్రిక. దీనిని ప్రకాశం జిల్లాకు చెందిన "వి.నాగమూర్తి", పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన "ఎస్.చైతన్యకుమార్" మరియు శ్రీకాకుళం జిల్లాకు చెందిన "డి.మురళి" అనే  విజ్ఞాన శాస్త్రోపాధ్యాయులు సయుక్తంగా సంపాదకత్వం వహిస్తున్నారు. ఇది "www.vignanadeepika.com" అనే వెబ్‌సైట్ ద్వారా ప్రచురితమవుతుంది. ఈ పత్రికలో సంపాదక వర్గం కీలక భూమిక పోషించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందిన విజ్ఞాన శాస్త్రోపాధ్యాయులు వివిధ శీర్షికలను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు.  ఈ పత్రికలో విద్యార్థులకు అవసరమైన శాస్త్ర విజ్ఞాన అంశాలను వివిధ రంగాలలో ఉన్న నిష్ణాతులు, ఉపాధ్యాయులు అందిస్తున్నారు. ఈ పత్రికలో జీవశాస్త్రం మరియు భౌతిక రసాయన శాస్త్రాల అంశాలుంటాయి. వానిలో ఆవిష్కరణ, అంతరించిపోతున్న జంతువులు, చిత్రం చూడరా చిన్నోడా, క్రియేటివ్ కార్నర్, ఈ నెల ప్రయోగం, ఈ నెల ప్రాజెక్టు, టెక్ చైతన్యం, పాఠ్యపథకములు, మహనీయులు, పోటీపరీక్షల ప్రశ్నలు, సందేహాలు-సమాధానాలు, పజిల్స్, మరియు వింతల లోకం అనే శీర్షికలున్నాయి. అవే కాకుండా సులభంగా చేసే ప్రయోగాలు, నిజజీవితంలో విజ్ఞానశాస్త్ర అంశాలు మరియు నెలలో వివిధ శాస్త్రరంగ ప్రముఖ దినాల గూర్చి సమాచారం చేర్చబడుతుంది. విద్యార్థులను అత్యున్నత భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ పత్రిక ఉపయోగపడుతుంది. దీనిని ప్రతీ పాఠశాలలో విద్యార్థులతో చదివించినట్లయితే వారిలో శాస్త్రీయ దృక్పథం, వైజ్ఞానిక ఆవిష్కరణల పట్ల ఉత్సుకత కలిగి మంచి విజ్ఞానవేత్తలుగా తయారవుతారు. 
ఈ పత్రిక యొక్క పి.డి.ఎఫ్ కాపీలను   డౌన్ లోడ్ చేసుకొని చదవండి.....చదివించండి..... విజ్ఞాన శాస్త్రవేత్తలను తయారుచేయండి.......


No comments:

Post a Comment