MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

NATIONAL SCIENCE DAY - S. SANKARARAO, SRIKAKULAM

విజ్ఞాన శాస్త్రం పట్ల జిజ్ఞాస కావాలి

         "సముద్రం నీలంగా ఎందుకు ఉంది?" అనే ప్రశ్న 1921లో లండన్లో ఒక సమావేశానికి వెళ్లి తిరిగివస్తున్న సమయంలో మధ్యధరా సముద్ర నీలిజలాల నీలవర్ణం చూసిన సి.వి.రామన్ మనస్సులో సుళ్ళు తిరిగింది. ఆయనలో రగిలిన జిజ్ఞాస ఫలితంగా అద్భుత వైజ్ఞానిక ఫలితం “రామన్ ఎఫెక్ట్" ఆవిష్కరించబడింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరచిన రోజైన ఫిబ్రవరి 28ను జాతీయ సైన్సు దినోత్సవంగా ప్రతియేడూ జరుపుకోవడం జరుగుతుంది.

          భౌతిక విజ్ఞాన శాస్త్ర బృహస్పతిగా ఎదిగిన చంద్రశేఖర వెంకటరామన్ 1888లో తమిళనాడులోని తిరుచిరపల్లి లో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు జన్మించారు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం పదకొండవ ఏటికే ముగిసింది. ఫిజిక్స్, ఇంగ్లీషులో డిగ్రీని పదిహేనవ ఏటికే పూర్తిచేసారు. 18 ఏళ్ల వయసుకే చెన్నై లోని పెసిడెన్సీ కాలేజ్ నుంచి హానర్స్‌లో మాస్టర్ డిగ్రీ సాధించారు. కోల్‌కతా లోని ఆడిటర్ జనరల్ కార్యాలయంలో 19వ ఏట అసిస్టెంట్ జనరల్‌గా నియమితులయ్యారు. విజ్ఞాన శాస్త్రమంటే ఎక్కువ అభిరుచి గల సి.వి.రామన్, భారతదేశంలో ఆధునిక విజ్ఞాన శాస్త్ర విషయాన్ని అభివృద్ధిపరిచే లక్ష్యంతో మహేంద్రలాల్ సర్కార్ చే స్థాపించబడిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్గివేషన్ ఆఫ్ సైన్సు సంస్థకు చెందిన పరిశోధనలు చేసారు. రామన్ పరిశోధనలు పరిణితమేధ గూర్చి తెలుసుకున్న విద్యావేత్త అశుతోష్ ముఖర్జీ తన కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర విభాగాన్ని ఏర్పరచి రామన్‌ను ఆహ్వానించాడు. రామస్ వెంటనే సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని వదిలేసి, తనకిష్టమైన విజ్ఞాన శాస్త్ర రంగానికి అంకితమయ్యారు. సముద్రపు నీలివర్ణం గురించిన సమస్యకు అప్పటి వరకు లార్డ్ రేలే పరిశోధన అంశాలే ప్రామాణికంగా ఆమోదించబడి ఉన్నాయి. రేలే ప్రకారం ఆకాశంలో అన్నివైపులకు చెదిరిపోయే సూర్యకాంతి తిరిగి మనవైపే ప్రసరిస్తుంది. ఈ దశలో ఈ కాంతి వయలేట్ వర్ణపటం వైపు వంగి ఎక్కువ నీలంగా కనిపిస్తుంది. ఇదే ఆకాశం నీలంగా కనిపించటానికి ప్రధాన కారణం. మరి సముద్రం నీలంగా కనిపించటానికి కారణం అది నీలాకాశాన్ని ప్రతిఫలించటమే అన్నారు రేలే, కానీ, రామన్ తన సముద్రయానంలో మధ్యధరా సముద్రపు నీలవర్గాన్ని చూసినప్పుడు రేలే సూత్రీకరణ సంతృప్తి కలిగించలేదు. గాలివలెనే నీటి కణాలు కూడా కాంతిని చెదరగొట్టవా? అనే ప్రశ్న ఉదయించింది. ఇక ధృవాలపై పరిశీలనలు, పరిశోధనలు ప్రారంభించారు రామన్, వాయురేణువులు కాంతిని చెదరగొట్టడం వల్లే ధృవరేణువులు కూడా కాంతిని చెదరగొడతాయనే పరిశోధన కాంతి విజ్ఞానంలో చాలా గొప్పదిగా చెప్పవచ్చును. దీనికోసం రామన్ అతి పరిశుద్ధమైన యాబై వరకు ద్రవాలతో ప్రయోగాలు జరిపారు. 1928 ఫిబ్రవరి 28న అద్భుతప్రయోగం జరిగింది. ఈ ప్రయోగంలో ద్రవాలు కాంతిని విశ్లేషించినపుడు రేలే సూత్రాలతో పాటు తరంగదైర్ఘ్యం మారుతుందనే సూత్రం రుజువు చేయబడింది. ఇది కొత్త పరిశోధనలకు దిక్సూచి అయింది. ఇదే 'రామన్ ఎఫెక్కగా గుర్తంపు పొందింది. రామస్ పరిశోధనను రాయల్ సొసైటీలో రూథర్‌ఫర్డు ప్రకటించారు. బ్రిటీష్ ప్రభుత్వం రామన్‌కు "నైట్‌హుడ్’ ప్రధానం చేసింది. 1930లో భౌతిక శాస్త్రంలో చేసిన కృషికి గానూ నోబెల్ బహుమతిని పొందారు . సి.వి.రామస్. రామస్ తర్వాత ఆ రంగంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయ శాస్త్రవేత్తలు లేరనే చెప్పాలి. అంటే నూతన ఆవిష్కరణలు ఈ శతాబ్దంలో లేనట్లే కదా! 1933లో రామస్ టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సీన్సుకు తొలి భారతీయ డైరక్టరు అయ్యారు. 1948లో బెంగళూరుకు దగ్గరలో రామన్ ఇనిస్టిట్యూట్ నెలకొల్చి 1970 వరకు విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు నిర్వహిస్తూ వచ్చారు. సంస్థకు ప్రభుత్వం సహాయం లేకుండా కేవలం దాతల విరాళాలతో నిర్వహించటం జరిగింది. 1970 నవంబరు 21న రామన్ తుది శ్వాస తీసుకున్నారు. శాస్త్ర విజ్ఞానం అంటే ద్రావకాలు, పరీక్షనాళాలు, రిటార్టులు, ఆదరా బాదరా ప్రదర్శనలు కాదు. ప్రకృతి రహస్యాలను తెలుసుకునే అవసరం నాటి ఆదిమానవుల నుంచి నేటి ఆధునిక మానవుల వరకూ ఉంది. మనిషి పక్షుల్లాగ ఎగరలేడు, గుర్రంలా పరుగెత్తలేడు, కుక్కలాగ వాసన చూడలేడు. కాని మనిషి దేహనిర్మాణంలో గొప్పదైన మెదడు సహాయంతో అన్ని జంతువుల శక్తులను కృత్రిమంగా సాధించాడు. నేడు మనిషి ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణిస్తున్నాడు. యంత్ర సహాయంతో దూరగ్రహాల ఛాయాచిత్రాలను భూమికి తెప్పిస్తున్నాడు. చంద్రమండలం మీదికి మనుషులను పంపంచగలిగాడు. మార్స్ గ్రహంపై జీవం ఉన్నదా? లేదా అని అన్వేషణ చేస్తున్నాడు. ఇంతటి శాస్త్ర విజ్ఞానం వెనుక ఎందరెందరో శాస్త్రజ్ఞల కృషి ఆవిష్కరణల ఫలితాలు ఉన్నాయి. సైన్సు చెప్పడం అంటే ఈ ప్రశ్నలు - సూత్రాలు కాదు. వాటి ఆవిష్కరణల వెనుక జరిగిన త్యాగాలు చెప్పాలి, మరియు మాతృభాషలో బోధన జరగాలి, పిల్లలకు శాస్త్రబోధన సరియైన పద్దతిలో చేస్తే ప్రతిఒక్కరూ శాస్త్రవేత్తలు అవుతారు. అనేక నూతన ఆవిష్కరణలు వెలువడతాయి. శాస్త్రజ్ఞడు కావాలంటే అసామాన్య ప్రజ్ఞ ఉండాల్సినదే అనుట పొరపాటు. సామాన్యులే తమ ఆలోచనల నుంచి సొంత పరిశోధనలు గావించి విజ్ఞానులవుతారు. అయితే తమ పరిజ్ఞానాన్ని పదును పెడుతుండాలి. దానితోపాటు శ్రమను కూడా చేర్చుకోవాలి. అప్పుడు ప్రతి శాస్త్రవేత్త కాగలరు. ఈ రోజు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ నుండి సి.వి.రామన్ వరకు ఎందరెందరో శాస్త్రవెత్తలను గూర్చి గూర్చి చెప్పకుంటున్నాము. వీరి ఆవిష్కరణలకు మూలమైన పలు అంశాలను గూర్చి ముందరే ఆవిష్కరించినవారు ఎందరెందరో ఉంటారు. మానవ సమాజ ప్రగతికి అవసరమైన ఒక ముఖ్యమైన ఆవిష్కరణ గావించి దానిని ప్రపంచం తెలుసుకోకమునుపే ఆర్ధిక పరిస్థితులకో, అనారోగ్యానికో, ఆంక్షలకో బలైపోయిన శాస్త్రవేత్తలెందరో ఉన్నారు. విశాల విశ్వంలో సైన్సు ప్రమేయం లేకుండా ఏదీలేదు. మనం ధరించిన దుస్తులు, విద్యుత్ దీపాల చల్లని, తెల్లని కాంతులు, వెలుగులూ సైనువల్ల లభించినవే. ఈ రోజు బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, జెనటిక్ ఇంజనీరింగ్, హ్యూమస్ జీనోమ్, జిన్ థెరపి, క్లోనింగ్, స్టెమ్‌సెల్ రీసెర్చ్, చంద్రయాన్ ప్రాజెక్ట్, నానో టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఆర్టిఫీషియల్ లైఫ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వంటి అనేక విషయాలపై నిరంతర పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నూతన సృష్టికి రూపకల్పన చేయగల శక్తి, విజ్ఞానం మనిషికే సొంతం. ఈ రోజు మైకోప్లాస్మా జెనిటీలియం అనే బాక్టీరియా ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఒక కణం నుంచి జీవి పూర్తి రూపాన్ని తయారుచేయడానికి వీలవుతుంది. మరి సత్యాలను మరుగున పెట్టి, మూఢ విశ్వాసాలను వ్యాపింపజేయడానికి, అంధ విశ్వాసాలలో ప్రజలను నిరంతరం కునారిల్లజేయడానికి పాటుపడుతున్న శక్తు ల కారణంగా సమాజం అనుకున్నంతగా వైజ్ఞానిక సమా జంగా రూపొందలేకపోయిందనేది జగమెరిగిన సత్యం.

క్రీ.శ 1609లో గెలీలియో దూరదర్శిని (టెలిస్కోప్) తయారుచేశారు. 1610లో చంద్రుని మీద ఉన్న పర్వతాలను, ఆకాశంలోని వివిధ గ్రహాలను, నక్షత్రాల ను పరిశీలించారు, తాను చేసిన పరిశోదనల ఆధారంగా టాలమీ ప్రతిపాదించిన భూకేంద్రక సిద్దాంతం తప్పు అని, కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతం ఒప్పు అని నిరూపిస్తూ, "డైలాగ్ ఆన్ ది టు చీఫ్ వరల్డ్ సిస్టమ్స్ టాలెమిక్ అండ్ కోపర్నికస్", "మెసేజ్ ప్రం ది స్టార్స్, లైటర్స్ ఆన్ ది సన్ స్పాట్ మొదలగు పుస్తకాలను వెలువరించాడు. దీనికి నాటి మత గురువు లు గెలీలియో మీద చర్య తీసుకోవాలంటూ పోపు మీద తీవ్ర ఒత్తిడితేగా, 1616లో గెలీలియో రచనలు నిషేధిస్తూ పోప్ డిక్రీ జారీ చేశాడు. ఆ నిషేధం 250 సంవత్సరాలకు పైగా కొనసాగింది. నిరూపించబడిన సత్యాన్ని అంగీకరించకపోవడం శాస్త్రీయ దృక్పధానికి తూటు పొడవడమే. అలా అని శాస్త్ర విజ్ఞాన ఫలితాలు అనుభవించకుండా ఉంటున్నారా? ప్రజలను మూడాచారాలలో ముంచి, తాము మాత్రం విజ్ఞాన శాస్త్రం అందించే ఫలాలను సుష్టుగా భోంచేస్తున్నారు. అక్కడతో ఆగకుండా శాస్త్రీయతను ప్రశ్నించేవారిపై అసహనంతో ఊగిపోవడం జరుగుతుంది. మరొక విషయం. అన్నీ వేదాల్లోనే ఉన్నాయట చందంగా వినాయకునికి తల అతికించడం దగ్గరి నుంచి కౌరవుల పుట్టుక టెస్ట్‌ట్యూబ్ బేబీల వరకు, పుష్పక విమాన ఆకాశయానం వరకు అంతా అయోమయ తిరోగామి భావాలు చెంత, ఆర్ధిక వనరులు లేని ఎన్నెన్ని సైన్స్ కాంగ్రెస్‌లతో జరిగే ఆవిష్కరణలు దేశ విజ్ఞాన పురోగతికి దోహదపడేదెప్పడు?

సైన్స్ తరగతిలో సైన్స్ టీచరు మన పిల్లలను ఆరేళ్ల నుంచే బాలశాస్త్రజ్ఞలుగా భావించి వారితో మెలగాలని సర్ సి.వి.రామస్ పేర్కొన్నారు. నిజమే పిల్లల్లో నిబిడీకృతమైన సృజనాత్మక శక్తులను వెలికితీయగల గొప్ప నేర్చుగలవాడు ఉపాధ్యాయుడే. అయితే పిల్లల్లో విజ్ఞానశాస్త్రం పట్ల జిజ్ఞాస కావాలి. ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలను తన సృజనాత్మకతను జోడించి ఆవిష్కరణలు చేయగల అన్ని రకాల వసతులు, వనరులు తనకు లభించాలి. అత్తెసరు ఆర్ధిక వనరులు కాకుండా నిరంతర ప్రయోగాలు చేయుటకు అవసర మైన వనరులు పిల్లవానికి నిరాటంకంగా అందివ్వాలి. అప్పడే వాడు ప్రకృతిని పరిశీలిసూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ వాటిని నిరూపిస్తూ, కొత్త సూత్రాలు, సిద్దాంతాలు కనిపెట్టగలడు. అలా కాకుండా మనిషిని పరాధీన భావనలోకి, మానసిక భావదాస్యం లోనికి నెట్టివేసే మతమౌడ్యాలు, మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తే చివరికి మిగిలేది శూన్యమే. ఇంకొక విషయం కూడా చెప్పకోవాల్సిన అవసరమిక్కడ ఉంది. గత 25 సంవత్సరాలుగా ప్రపంచీకరణలో భాగంగా దేశంలో పలు విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో విద్య అంటే ఆంగ్ల మాధ్యమంలో విద్య ఉద్యోగం అంటే డాలరు సంపాదించే సాఫ్టవేర్ ఉద్యోగం. అంతకంటే ఎక్కువ ఆలోచించలేని పరిస్థితి. ప్రస్తుత ట్రంపీకరణలో భాగంగానైనా స్వయంప్రతిపత్తి గల దేశీయ చదువులతో, దేశీయ ఉపాధి విద్యావకా శాలతో, ప్రగతి పధాన శాస్త్ర విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళుటలో ప్రతిఒక్కరూ ఒక శాస్త్రవేత్తయై కృషి చేయాలని, శాస్త్రీయతకు పట్టం కట్టాలని, నిస్వార్ణంగా సమాజ పురోగతికి పాల్పడే శాస్త్రవేత్తల్ని సామాజిక శాస్త్రవేత్తల్ని అధ్యాపకుల్ని దార్శనికుల్ని గౌరవించాలని, ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగంతో దేశానికి కీర్తి ప్రతిష్టలు సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల స్ఫూర్తిని పొందాలని, సైన్స్ ను వినాశనానికి ఉపయోగించకుంటా మానవజాతి ప్రయోజనానికి తోడ్పడే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ,


No comments:

Post a Comment