MAIN MENU

✿ ఈ బ్లాగు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు కొంత సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినది. ఇందులో ఉన్న సమాచారాన్ని విద్యా బోధన, అభ్యసన కొరకు వినియోగించుకోవచ్చును. ✿

SCIENCE DAY SPEECH IN TELUGU

జాతీయ సైన్సు దినోత్సవం

అందరికి శుభోదయం,

వేదికను అలంకరించిన పాఠశాల ప్రధానాచార్యులకు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయినులకు, అతిధులకు, నా నమస్కారాలు,    నా తోటి విద్యార్థినీ, విద్యార్థులకు నా అభినందనలు.

ఈ రోజు చాలా శుదినం. ముందుగా, ఈ శాస్త్ర దినోత్సవ సందర్బంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 శాస్త్ర దినోత్సవాన్ని మనం సర్ సివి రామన్ గారి గొప్ప ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా మనదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 28 తారీఖున జరుపుకుంటారు.

ఫిబ్రవరి 28, 1928 సర్ సి.వి.రామన్, తనరామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా రోజును భారత ప్రభుత్వంజాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కా రంలో, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో, ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించాలనకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్త్రజ్ఞుల  పాత్ర విలువకట్టలేనిది. జాతీయ స్థాయిలో సైన్స్ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం నేషనల్ సైన్స్ డే లక్ష్యాలు.

ఏక వర్ణకాంతి, వస్తువుపై పడి పరిచ్ఛేదనం చెందినపుడు బహిర్గత కాంతిలో ఎక్కువ తీవ్రత మరియు తక్కువ తీవ్రత గల్గిన రేఖలు ఏర్పడుతాయి. హెచ్చు తీవ్రత గల్గిన రేఖలను "స్టోక్ రేఖ" లనీ, తక్కువ తీవ్రత గల్గిన రేఖలను ప్రతి లేదా "వ్యతిరేక స్టోక్" రేఖలనీ అంటారు. ఇటువంటి దృగ్విషయాన్ని "రామన్ ఫలితము" అంటారు. ఇక్కడ జరిగే పరిచ్ఛేదనాన్ని రామన్ పరిచ్ఛేదనం లేదా రామన్ స్కేటరింగ్ అంటారు. దృగ్విషయాన్ని సర్.సి.వి. రామన్ ఫిబ్రవరి 28 తేదీన వెలుగులోకి తేవడం చేత ఫిబ్రవరి 28 తేదీని "జాతీయ విజ్ఞాన శాస్త్రదినము" గా ప్రభుత్వం ప్రకటించింది. రోజును "రామన్స్ డే" అని గూడ అంటారు. ప్రపంచం నలుమూలల రామన్ పేరు మారుమోగిపోయింది.

భారతఖండం ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందింది 1930 సంవత్సరం ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి  రామన్ కు లభించింది. ఫిబ్రవరి 28 తేదీన దేశం నలుమూలల వైజ్ఞానిక సదస్సులు, చర్చాగోస్టులు, జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహా సమావేశాలు, విజ్ఞానశాస్త్ర ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసే సంబరాలు అంబరాన్ని అంటడం ప్రతి యేడాది ఆనవాయితీ.

ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవలసినది శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత దేశం చాలా అభివృద్ధి చెందింది. ఇటీవల మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకే రాకెట్ తో 104 ఉపగ్రహాలనువిజయ వంతంగా పంపి, 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ తో పంపిన తొలి దేశం గా రికార్డు సృష్టించింది. ప్రపంచ దేశాలన్నింటి దృష్టిని మనదేశంపై పడేలా, మన దేశం గర్వ పడేలా ఆ రాకెట్ ప్రయోగం నిలిచింది. అలాగే మన దేశం ఇంకా శాస్త్ర సాంకేతిక రంగాలలో చాలా అభివృద్ధి చెందాలి. దానికి యువత కృషి చాలా అవసరం. మన మందరం మంచి శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధికి కృషిచేయాలి.

ఈసందర్బంగా విద్యార్థుల మైన మనం మంచి క్రమ శిక్షణతో మెలుగుతూ, శాస్త్రాన్ని బట్టీ విధానంతో కాకుండా మంచి అవగాహనతో, మంచి కృత్యాలతో, మంచి ప్రయోగాలతో శాస్త్ర బద్దంగా అభ్యసించి విజ్ఞాన శాస్త్ర రంగంలో ప్రపంచ దేశాలన్నిటికన్నా మన భారత దేశాన్ని ముందుంచాలని ఆశిస్తున్నాను.

నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పాఠశాల ప్రధానాచార్యులకు, నా ప్రసంగాన్ని ఏంతో ఓపికతో విన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

ధన్యవాదాలు.

 

No comments:

Post a Comment